సంచలన డైరెక్టర్ ఆర్జీవీ(Rgv) నుంచి వస్తోన్నలేటెస్ట్ మూవీ వ్యూహం(Vyooham). దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
వ్యూహం,శపథం టైటిల్స్తో రెండు పార్టులుగా రానున్నాయి. మొదటి పార్ట్ వ్యూహం గతేడాది నవంబర్ 13 న రిలీజ్ కావాల్సి ఉండగా..పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక పట్టు వదలని విక్రమార్కుడిలా డైరెక్టర్ వర్మ..ఎట్టకేలకు సెన్సార్ క్లియరెన్స్ తీసుకొచ్చాడు. దీంతో ఒకేసారి వ్యూహం, శపథం(Shapatham) రిలీజ్ డేట్స్ ప్రకటించేశాడు.లేటెస్ట్గా వర్మ ట్విట్టర్లో రిలీజ్ పోస్టర్స్ను షేర్ చేశాడు.
— Ram Gopal Varma (@RGVzoomin) February 10, 2024
మొదటి పార్ట్ వ్యూహం మూవీ ఈ నెల (ఫిబ్రవరి 23న) రిలీజ్ చేస్తుండగా..సెకండ్ పార్ట్ శపథం వచ్చే నెల(మార్చి 1న) ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఇక ఎన్నో రోజుల నుంచి వర్మ ప్రకటించిన ఈ సినిమాలను చూసేందుకు..ఆడియన్స్ తెగ వెయిట్ చేస్తూ వచ్చారు.ఇక రిలీజ్ డేట్స్ వచ్చాక ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.మరి వ్యూహం రిలీజ్ అయ్యేలోపు..ఎలాంటి అడ్డంకులు రాకుండా థియేటర్స్ లోకి వస్తుందో లేదో చూడాలి.
వ్యూహం..శపథం మూవీస్ ప్రస్తుత రాజకీయాలను బేస్ చేసుకుని వస్తుండటంతో..వర్మ ఎలాంటి కంటెంట్ చూపించబోతున్నారనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. అందుకు కారణం లేకపోలేదు..ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన జగన్ పాత్ర, వైఎస్ భారతి, చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ పాత్రలు పరిచయం చేయడమే.టీజర్, ట్రైలర్లో వారికి సంబంధించిన సీన్స్ కూడా కలవరం స్పృష్టించే విధంగా ఉండటమే!
వ్యూహం మూవీలో జగన్ పాత్రను దక్షిణాది నటుడు అజ్మల్ అమీర్ నటిస్తుండగా..వైఎస్ భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటిస్తుంది. ‘అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం’ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. అంతేకాదు..వర్మ 'ఇది బయోపిక్ కాదని..బయోపిక్ ను మించిన రియల్ పిక్' అని ప్రకటించిన విషయం తెలిసేందే.