ఆర్జీవీ వెతుకుతున్న అమ్మాయి దొరికేసింది.. ఆఫర్ కూడా ఇచ్చేశాడు

క్రియేటీవ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వ‌ర్మ‌(Ram Gopal Varma) రెండు రోజుల క్రితం తన ఇంస్టాగ్రామ్ లో  ఒక అమ్మాయి వీడియో షేర్ చేసి ఈ  అమ్మాయి ఎవరో తెలుసా అంటూ నెటిజన్స్ ను ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. ఆ అమ్మాయి ఓవర్ నైట్ ఫేమస్ అయిపొయింది. దీంతో ఆ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరు అనేది తెలుసుకోవడానికి నెటిజన్స్ సర్చింగ్ మొదలెట్టేశారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RGV (@rgvzoomin)

తాజాగా  ఆ అమ్మాయి దొరికింది అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ డీటెయిల్స్ పోస్టు చేశాడు ఆర్జీవీ. ఆ అమ్మాయికి సంబందించిన మరో వీడియోను షేర్ చేసి.. కొంతమంది చీర అందమైన డ్రెస్ అని చెప్తూ ఉంటారు. ఆ విషయం నేను ఈ వీడియో చేసేవరకు నమ్మలేదు. ఆ అమ్మాయి నన్ను ‘శారీ'(చీర) అనే సినిమా తీయాలని ఆలోచించేలా మోటివేట్ చేసింది. ఆమెతోనే ఆ సినిమా తీస్తాను.. అంటూ పోస్ట్ రాసుకొచ్చాడు వర్మ. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇంతకీ వీడియోలో అందమైన చీరకట్టుతో కనిపించిన ఆ అమ్మాయి మరెవరో కాదు.. మళయాళ నటి శ్రీలక్ష్మి సతీష్. ఇప్పుడిప్పుడే నటిగా అవకాశాల కోసం ట్రై చేస్తున్న శ్రీలక్ష్మి సతీష్.. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కంట్లో పడి ఫుల్  ఫేమస్ అయ్యింది. ఈ వార్తలు మలయాళం న్యూస్ లో రావడంతో.. శ్రీలక్ష్మి కూడా ఆర్జీవీ తనపై చేసిన కామెంట్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. మరి ఆ అమ్మాయి ఎవరో తెలిసింది కాబట్టి వర్మ నిజంగా ఆమెతో చీర సినిమా తీస్తారా అనేది చూడాలి.