సంచలన సినిమాలకు పెట్టింది పేరు రామ్ గోపాల్ వర్మ. రియల్ లైఫ్ స్టోరీలను వెండితెరపై ఆవిష్కరించడంలో వర్మది అందవేసిన చేయి. తాజాగా వర్మ మరో బయోపిక్తో మనముందుకు వస్తున్నాడు. ప్రముఖ రాజకీయ నాయకులు కొండా మురళీ-, సురేఖ దంపతుల జీవిత కథను సినిమాగా రూపొందించాడు. ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో త్రిగుణ్, ఇర్రా మోర్ నటించారు. జూన్ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కొండా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హన్మకొండలో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ఆర్జీవీ తనలోని స్పెషల్ టాలెంట్తో ఫ్యాన్స్ను అలరించాడు.
కొండా మూవీలో ప్రజా గాయకుడు గద్దర్ పాడిన పొడుస్తున్న పొద్దుమీద పాటను ఆర్జీవీ రీ క్రియేట్ చేశాడు. అయితే ఈ పాటకు స్టేజీపై వర్మ స్టెప్పులేశాడు. చేతిలో గన్ను పట్టుకుని..మెడలో ఎర్రటి టవల్ను ధరించి టోపీ పెట్టుకుని డ్యాన్స్ ఇరగదీశాడు. హవభావాలు పలికిస్తూ నవ్వులు పూయించాడు.
Me enacting #podusthunna song at KONDA film pre release event ..Song sung my me and Nalgonda Gaddar .. https://t.co/KDOyxiuqWi via @YouTube
— Ram Gopal Varma (@RGVzoomin) June 19, 2022
ప్రస్తుతం వర్మ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన డ్యాన్స్ వీడియోను వర్మ ట్విట్టర్ లో షేర్ చేయడంతో..విపరీతమైన లైక్స్, కామెంట్స్ వచ్చాయి.