సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram gopal varma) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం(Vyooham). ఏపీ సీఎం జగన్ రాజకీయ ప్రస్థానంపై ఆర్జీవీ తెరకెక్కిస్తున్న మొదటి పార్ట్ వ్యూహం. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 'U' సర్టిఫికెట్ జారీ చేసిన విషయం తెలిసిందే.
లేటెస్ట్గా డైరెక్టర్ ఆర్జీవీ..వ్యూహం మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లోని ప్రతి పార్ట్ని వివరించగలరా? అంటూ ట్యాగ్ను జతచేశారు.పోస్టర్ వివరంగా చూసుకుంటే..తెలుగు దేశం పార్టీ సైకిల్ గుర్తును..జనసేన గ్లాస్ గుర్తును..వెనుకాల ఉన్న చింపాంజీని చూపిస్తూ..కూల్గా ఛాయ్ తాగే ఆర్జీవీ.. అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఎవ్వరికీ తగ్గట్లు వారు పోస్టర్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వీలుంటే మీరు కూడా పోస్టర్ వైపు ఒక లుక్కేయండి. కాగా ఈ మూవీ డిసెంబర్ 29న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
Can u analyse this poster and explain each part ? pic.twitter.com/03FudnUXnN
— Ram Gopal Varma (@RGVzoomin) December 14, 2023
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి(YS Rajashekhara reddy) మరణాంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఆర్జీవీ. జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? జగన్ ఏపీ సీఎం ఎలా అయ్యారు? అనే కథాంశాలను తెరకెక్కిస్తున్నారు. .
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న..వ్యూహం సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ సెన్సార్ బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో విడుదల వాయిదా పడింది. సినిమాలో పాత్రలు రియల్ లైఫ్ వ్యక్తులను పోలి ఉండడం, పాత్రల పేర్లు కూడా అవే ఉండడంతో బోర్డు సభ్యులు సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆర్జీవీ వెనక్కడుగు వేయకుండా..పట్టు వదలని విక్రమార్కుడిలా తన వ్యూహాలతో..ఎట్టకేలకు వ్యూహం రిలీజ్ డేట్ తీసుకొచ్చాడు.