పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ. మహానటి ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని కీ రోల్స్ చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో ఇండియన్ మైథాలజీ కాన్సెప్ట్ తో స్కైఫై మూవీగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్ ఉండటంతో ఆ అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. జూన్ 27న విడుదలవుతున్న ఈ సినిమా నుండి తాజాగా రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.
అద్భుతమైన విజువల్స్ తో వచ్చిన ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది. ఆడియన్స్ కూడా ఈ ట్రైలర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ ట్రైలర్ పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. అంతేకాదు.. కల్కి ట్రైలర్ పై ఆడియన్స్ కి ఓ పజిల్ విసిరాడు. తన సోషల్ మీడియాలో కల్కి సినిమా గురించి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ టైం లో సెంటెన్స్ రాసి.. దాన్ని ఎవరైతే ముందుగా ఫిల్ చేస్తారో వాళ్లకి లక్ష రూపాయల బహుమానం ఇస్తానని ప్రకటించాడు.
🔥🔥🔥 Check out the M_____F___ing P_____ L___ing A___ B____ing Trailer of KALKI 2898 AD😘😘😘 .. I will give 1 lakh prize for whoever first fills the correct words in the blanks 💪💪💪 https://t.co/Moex5gZKnV
— Ram Gopal Varma (@RGVzoomin) June 21, 2024
దాంతో.. ఆర్‌జీవీ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇంకేముంది.. ఆ పజిల్ చూసిన నెటిజన్స్ దాని కంప్లీట్ చేయడానికి, లక్ష కొట్టేయడానికి ట్రే చేయడం మొదలుపెట్టేశారు. మరి లేట్ ఎందుకు వీలుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.