Ram Gopal Varma: తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే ఊరుకోనంటూ ఆర్జీవీ స్ట్రాంగ్ వార్నింగ్..

Ram Gopal Varma: తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే ఊరుకోనంటూ ఆర్జీవీ స్ట్రాంగ్ వార్నింగ్..

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన వ్యూహం సినిమా కాంట్రవర్సీ రోపజురోజుకి ముదురుతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ నారా చంద్రబాబు నాయుడు,నారా లోకేష్, బ్రాహ్మణి, పవన్ కళ్యాణ్(జనసేన) తదితరుల ఫోటోలను ఉపయోగించి వ్యంగ్యంగా చూపించారంటూ కొందరు టీడీపి నాయకులు ఆరోపణలు చేస్తూ పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్జీవిపై పోలీసులు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి విచారణకి రావాలని పిలస్తున్నప్పటికీ ఆర్జీవీ మాత్రం స్పందించడం లేదు.

అయితే ఇప్పుడు వ్యూహం సినిమాపై మరోక్రొత్త ఆరోపణలు వచ్చాయి. ఇందులో ముఖ్యంగా వ్యూహం సినిమా తీయడానికి ప్రభుత్వం నిధులు వాడారని, అలాగే ఈ సినిమాని ప్రసారం చెయ్యడానికి వైసీపీ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ద్వారా దాదాపుగా రూ2.10 కోట్లు మంజారు చేసిందిని ఆరోపణలు వస్తున్నాయి. అంతేగాకుండా విజిలెన్స్ అధికారులు కూడా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ పై ఐటీ దాడులు జరపగా ఈ విషయాలు బయటపడ్డాయని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ విషయంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

ఇందులోభాగంగా ‘వ్యూహం’ సినిమాకి  దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మాత కాగా శ్రీకాంత్‌ ఫైనాన్స్‌ను అందించారని తెలిపాడు. నా పార్టనర్‌ రవివర్మ సొంతంగా ఫైనాన్షియర్‌ శ్రీకాంత్‌ నుండి ఏపి ఫైబర్‌ నెట్‌ ప్రసారహక్కులను కొనుగోలు చేశారని స్పష్టం చేశాడు. ఏపి ఫైబర్‌నెట్‌ రవివర్మనుండి  ప్రసార హక్కులను రెండుకోట్ల వ్యయంతో కొనుగోలు చేసిందని, కానీ ఇందులో కోటి రూపాయలు మాత్రమే ఎకౌంట్‌కు వచ్చిందని తెలిపాడు. ఇది శ్రీకాంత్, రవివర్మలకు సంబంధించిన ఒప్పందం. ఈ హక్కులు ఏపి ఫైబర్‌నెట్‌కు 60 రోజులపాటు ఇవ్వబడ్డాయి.

ALSO READ : Adivi Sesh Movies: అడివి శేష్ స‌ర్ప్రైజ్ పోస్ట్.. ఆ రెండు పాన్ ఇండియా సినిమాల అప్డేట్స్

 ఏపి ఫైబర్‌నెట్‌ వారు చెప్పిన ప్రకారం లక్షా యాభైవేల వ్యూస్‌ను సొంతం చేసుకుందని కానీ ఆ సమయంలో టిడిపిపార్టీ ఎలక్షన్‌ కమీషన్‌కి కంప్లైంట్‌ ఇవ్వటంతో ప్రసారాలను నిలిపివేశామని అన్నారు. అయితే రవివర్మకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్‌ ఎమౌంట్‌ను ఏపి ఫైబర్‌నెట్‌ నిలిపివేసిందని దీంతో తన బకాయి మొత్తం చెల్లించనందున నా పార్టనర్‌ రవివర్మ సివిల్‌ కోర్టులో కేసు పెట్టారని తెలిపాడు. 

ఇక నిజానిజాలు తెలుసుకోకుండా తమ గురించి కొన్ని ఛానల్స్‌ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని వారిపై నష్ట పరిహారం కోసం కేసులు పెడుతున్నామని ట్వీట్ లో పేర్కొన్నాడు. దీంతో ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఆర్జీవి సోషల్ మీడియా అలాగే సినిమాలతో వైసీపీ పార్టీకి సపోర్ట్ చేశాడని అందుకే ఇప్పుడు టీడీపీ పార్టీ కావాలనే ఆర్జీవీ ని టార్గెట్ చేస్తున్నారని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.