ఆర్జీవీ (Ram Gopal Varma) దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హీరోగా వచ్చిన సినిమా సర్కార్ (Sarkar). 2003లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
లేటెస్ట్ ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను గుర్తుచేసుకున్నారు. అమితాబ్ వల్ల అందులోని సన్నివేశం అద్భుతంగా వచ్చిందన్నా రు. ఈ సినిమాలోని ఓ సన్నివేశ చిత్రీకరణ సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.
ఆర్జీవీ మాటల్లో.. 'అమితాబ్ తన కుమారుడిని బయటకు వెళ్లమనే సందర్భం వస్తుంది. ఆ సన్నివేశాన్ని ఎలా చేయాలనే దానిపై నాకు, అమితాబ్ కు మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి. కోపంగా అరిచి చెప్పాలని నేను సూచించాను. సర్కార్ అందరిలాంటి తండ్రి కాదు. కాబట్టి మరోలా చేయాలని అమితాబ్ వెప్పారు. అంత గొప్ప నటుడితో వాదించడం ఇష్టం లేక నేను మౌనంగా సరే అన్నాను. మరుసటి రోజు రీషూట్ చేద్దామని చెప్పా.. ఆరోజు రాత్రి 11 గంటలకు అమితాబ్ నాకు ఫోన్ చేశారు.
'నేను అనుకున్న విధానం కంటే నువు చెప్పిందే బాగుంది. రేపు ఇలానే రీషూట్ చేద్దాం' అన్నారు. తర్వాత రోజు ఆ సన్నివేశాన్ని రీషూట్ చేశాం. సీన్లో అమితాబ్ అద్భుతంగా నటించారు. అవతలి వారి ఆలోచనలు మనకు నచ్చకపోతే కొన్నిసార్లు మౌనంగా ఉండాలి. అందువల్ల పరిస్థితులు మనకు అనుకూలంగా మారుతాయి' అన్నాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ.