Ram Gopal Varma: ఒట్టేసి చెప్పినట్టే వచ్చేసాడు.. మనోజ్ బాజ్‌పేయ్తో ఆర్జీవీ హార్రర్ థ్రిల్లర్

Ram Gopal Varma: ఒట్టేసి చెప్పినట్టే వచ్చేసాడు.. మనోజ్ బాజ్‌పేయ్తో ఆర్జీవీ హార్రర్ థ్రిల్లర్

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)మరో కొత్త సినిమా ప్రకటించాడు. ఇటీవలే 'సత్యపై ఒట్టేసి చెబుతున్నా' పాత ఆర్జీవీని చూస్తారంటూ చెప్పుకొచ్చినట్టే, ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో వచ్చారు.

‘పోలీస్ స్టేషన్ మే భూత్’ (Police Station Mein Bhoot)అనే కొత్త హార‌ర్ మూవీని ప్రక‌టించారు. ‘మీరు చనిపోయిన వారిని చంపలేరు’ అనేది ట్యాగ్‌లైన్. ఇందులో మనోజ్ బాజ్‌పేయ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. వర్మ తనదైన శైలిలో టైటిల్, కాన్సెప్ట్, స్టోరీ ఐడియాను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. 

కాన్సెప్ట్:

భయపడినప్పుడు మనం పోలీసుల వద్దకు పరిగెత్తుతాము, కానీ పోలీసులు భయపడినప్పుడు ఎక్కడికి పరిగెత్తుతారు? అనే పాయింట్ మీద‌నే క‌థాంశం తిరుగుతున్నట్లు హింట్ ఇచ్చారు. 

స్టోరీ ఐడియా:

ఒక ఘోరమైన ఎన్‌కౌంటర్ హత్య తర్వాత, ఒక పోలీస్ స్టేషన్ హాంటెడ్ స్టేషన్‌గా మారుతుంది, అన్ని పోలీసులు గ్యాంగ్‌స్టర్ల దయ్యాల నుండి తప్పించుకోవడానికి భయంతో పరుగులు తీస్తారు. అని వర్మ తన కథాంశాన్ని తెలిపాడు. ఇపుడు అనౌన్స్ చేసిన తీరు చూస్తుంటే తన మాటలోని కసి, కాన్పిడెంట్‌ స్ప్రష్టంగా కనిపిస్తోంది. 

Also Read:- ధనుష్ కొత్త సినిమా అనౌన్స్.. కత్తిపై మానవ పుర్రె.. డైరెక్టర్ ఎవరంటే?

హార్రర్ సినిమాలు తెరకెక్కించడంలో ఆర్జీవీది ప్రత్యేకమైన శైలి. అందులో వచ్చినవే.. ‘దెయ్యం’, ‘మర్రి చెట్టు’  ‘భూత్’ ‘12 వ అంతస్థు’, ‘రాత్రి’, ‘కౌన్’ వంటి సినిమాలు తీసి అందర్నీ భయపెట్టించారు. మరి ఆ నాటి భయాన్ని గుర్తుచేసేలా.. రామ్ గోపాల్ వర్మ కంబ్యాక్ ఇచ్చినట్టే!చూడాలి ఏం జరుగుతుందో.

మనోజ్ వాజ్‌పేయి- రామ్ గోపాల్ వర్మ 1998లో వచ్చిన 'సత్య' (Satya)తో మంచి హిట్ కొట్టారు. వర్మ తీసిన గ్రేటెస్ట్ మూవీస్లో 'సత్య' ఒకటి. ఈ మూవీ 1998లో రిలీజై చరిత్ర సృష్టించింది. ఈ అండర్ వరల్డ్ గ్యాగ్ స్టార్ సినిమాలో జేడీ చక్రవర్తి, ఊర్మిళ మాటొడ్కర్, మనోజ్ బాజిపేయి కీ రోల్స్ చేశారు.

ఈ చిత్రంలో భికూ మత్రే పాత్రతో మనోజ్ వాజ్‌పేయి మంచి గుర్తింపు పొందాడు. భీకూ మాత్రేగా నటించిన మనోజ్ బాజ్‌పాయీ.. రానున్న ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ లో ఎలాంటి ఐకానిక్ క్యారెక్టర్ తో రానున్నాడో ఆసక్తి నెలకొంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.