RGV Pushpa 2 Review: పుష్ప 2 వైల్డ్ ఫైర్ కాదు.. వరల్డ్ ఫైర్ అంటూ స్టార్ డైరెక్టర్ రివ్యూ..

RGV Pushpa 2 Review: పుష్ప 2 వైల్డ్ ఫైర్ కాదు.. వరల్డ్ ఫైర్ అంటూ స్టార్ డైరెక్టర్ రివ్యూ..

టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందాన జంటగా నటించిన చిత్రం పుష్ప 2: ది రూల్. ఈ సినిమా 2021లో వచ్చిన పుష్ప : ది రైజ్ సినిమాకి సీక్వెల్. అయితే ఈ సినిమాకి టాలీవుడ్ ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా ప్రముఖ సినిమా నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ కలసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. కాగా పుష్ప 2 భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. దీంతో ఈ సినిమా చూసిన ఆడియన్స్ సినీ సెలెబ్రెటీలు సైతం మంచి పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.

Also Read:-బ్లాక్ బస్టర్ అనేది చిన్న పదం..

ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా పుష్ప 2 సినిమా చూసి సోషల్ మీడియా వెదికగా స్పందించాడు. ఇందులో భాగంగా హేయ్ అల్లు అర్జున్ పుష్ప 2 వైల్డ్ ఫైర్  కాదని, ఇది ఏకంగా వరల్డ్ ఫైర్ అంటూ పుష్ప 2 ఎమోజీస్ షేర్ చేస్తూ ట్వీట్ చేశాడు. దీంతో అల్లు అభిమానులు ఆర్జీవీ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే పుష్ప 2 సినిమా టికెట్ ధరల విషయంలో, సినిమా టీమ్ విషెష్ చెబుతూ సపోర్ట్ చేసినందుకు థాంక్స్ చెబుతున్నారు.

ఇక పుష్ప 2 సినిమాపై మరో స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందిస్తూ పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా  "అల్లుఅర్జున్ మరియు సుకుమార్!.. నమ్మశక్యం కాని ఘనతను సాధించారు. ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ సీన్, సీఎం ఫోటో సీన్, జటాహారా... ఇలా ప్రతిదీ నాన్‌స్టాప్ గూస్‌బంప్ మూమెంట్స్.. థియేటర్లలో ఇలాంటి అనుభవాలు చాలా అరుదు. బ్లాక్ బస్టర్ అనేది చిన్న పదం" అంటూ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ట్వీట్ చేశాడు.