క్రియేటీవ్ డైరెక్టర్ ఆర్జీవీ(Ram Gopal Varma) రెండు రోజుల క్రితం తన ఇంస్టాగ్రామ్ లో ఒక అమ్మాయి వీడియో షేర్ చేసి ఈ అమ్మాయి ఎవరో తెలుసా అంటూ నెటిజన్స్ ను ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. ఆ అమ్మాయి ఓవర్ నైట్ ఫేమస్ అయిపొయింది. దీంతో ఆ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరు అనేది తెలుసుకోవడానికి నెటిజన్స్ సర్చింగ్ మొదలెట్టేశారు. రీసెంట్గా ఆ అమ్మాయి దొరికిందంటూ తన సోషల్ మీడియా నుంచి ఆర్జీవీ తెలిపారు.
లేటెస్ట్ గా..సోషల్ మీడియాలో హైలెట్ అయినా శ్రీ లక్ష్మీ సతీష్(Sreelakshmi Satheesh).. తన ఫాలోవర్లతో, ఆర్జీవీ ఫ్యాన్స్తో ఇంస్టాగ్రామ్లో ముచ్చటించింది. ఆర్జీవీ ఫ్యాన్స్ అడిగిన వింత ప్రశ్నలకు తనదైన సమాధానాలతో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ బ్యూటీ. ఒక అభిమాని మీ ఎత్తు అని అడగ్గా..5'8 అని, మీ వయస్సు ఎంత అనగా..జస్ట్ 22 అని, మీరెంత చదివారు అంటే..అప్పుడే ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేశానని తెలిపింది. అలాగే తన బర్త్డే సెప్టెంబర్ 28 అని తెలిపింది.
డైరెక్టర్ ఆర్జీవీ తనదైన స్టైల్లో అమ్మాయిలని చూపిస్తాడు కదా..ఇప్పుడు నీ వీడియోలు కూడా షేర్ చేశాడు..మరి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది?..సేమ్ ఎప్పడు ఉన్నట్లే ఉందా? అని ఓ నెటిజన్ అడగ్గా..ప్రస్తుతానికి నా లైఫ్ ఇంట్రెసింగ్ గానే ఉందని..ఆర్జీవీ వల్ల తనకేమీ సరికొత్త ఫేమ్ రాలేదన్నట్టుగా ఆర్జీవీ స్టైల్లో సెటైర్ వేసింది. వాస్తవానికి ఆర్జీవీ షేర్ చేసిన ఫొటోస్ తో, వీడియోస్ తో అదిరిపోయే ఫాలోయింగ్ అమాంతం పెరిగిందని తెలిసిందే.
రీసెంట్గా..ఆర్జీవీ ట్విట్టర్లో శ్రీలక్ష్మీ చీరపై స్పందిస్తూ..ఆ అమ్మాయి నన్ను ‘శారీ'(చీర) అనే సినిమా తీయాలని ఆలోచించేలా మోటివేట్ చేసింది. ఆమెతోనే ఆ సినిమా తీస్తాను..అంటూ పోస్ట్ రాసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై.. శ్రీలక్ష్మీ సతీష్ రియాక్ట్ అవుతూ..వర్మ తన ఫోటోగ్రాఫర్ ద్వారా కాంటాక్ట్ అయ్యాడని..చీర సినిమా తప్పకుండా చేద్దామని అన్నాడట. కానీ చీర స్టోరీ మాత్రం ఇంకా చెప్పలేదని..ఒకవేళ స్టోరీ చెప్పిన తరువాత అంతా ఓకే అవుతుందని శ్రీలక్ష్మీ సతీష్ పేర్కొంది.
ఆర్జీవీ తెరకెక్కించిన రంగీలా మూవీ అంటే తనకు ఇష్టమని తెలిపింది. అలాగే మరో నెటిజన్ ప్రశ్న వేస్తూ..మీ ఇన్ స్టా అకౌంట్లో ఫార్పల్లా అని ఉంటుంది..దాని అర్ధం చెప్పగలరా..అది ఇటాలియన్ లో మంచి పదం అని, దాని అర్ధం..బట్టర్ ఫ్లై అని..తన ఇన్ స్టా సీక్రెట్ చెప్పేసేంది. ఆ చిట్ చాట్ సమయంలో నెటిజన్లు అందరూ ఆమె కళ్లు, జుట్టు గురించి పొగడసాగారు. తన కళ్ళతో..నడుము వంపుల చీరకట్టుతో మెస్మరైజ్ చేస్తున్న ఈ బ్యూటీ త్వరలో ఇండస్ట్రీ ఏలడం పక్కా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.