రామ్​గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష

రామ్​గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష
  • చెక్ బౌన్స్ కేసులో కోర్టు తీర్పు  

ముంబై:  డైరెక్టర్​ రామ్​గోపాల్ ​వర్మకు చెక్ బౌన్స్ కేసులో మూడు నెలల జైలు శిక్ష పడింది. ఆయనపై నాన్​బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. ఏడేండ్లుగా కొనసాగుతున్న కేసులో ముంబై అంథేరి మేజిస్ట్రేట్ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.

 మూడు నెలల్లోపు ఫిర్యాదుదారుడికి రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని, లేకుంటే అదనంగా మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు పేర్కొంది. అయితే, వర్మ కోర్టుకు గైర్హాజరవడంతో ఆయనపై వారంట్ జారీ చేసింది. కాగా, 2018లో వర్మపై మహేశ్‌‌ చంద్ర అనే వ్యక్తి ఈ చెక్‌‌ బౌన్స్‌‌ కేసు వేశారు. 2022లో కోర్టు వర్మకు బెయిల్​ మంజూరు చేసింది.