
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram gopal varma) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర రాజకీయాలపై ఒక సినిమా తియ్యబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అది కూడా రెండు భాగాలుగా ఈ సినిమా రానుంది. అందులో మొదటి భాగానికి ‘వ్యూహం’, రెండో భాగానికి ‘శపథం’ అనే టైటిల్స్ కూడా ఫిక్స్ చేశాడు వర్మ. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ షూటింగ్ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.
ఈ సినిమాలో ఏపీ సీఎం జగన్ (YS Jagan Mohan Reddy), వైఎస్ భారతి (Y S Bharati) క్యారెక్టర్ లో ఎవరు నటిస్తున్నది స్పష్టం చేసాడు వర్మ. అంతకుముందు వర్మ తెరకెక్కించిన లక్ష్మిస్ ఎన్టీఆర్ లో మూవీలో జగన్ పాత్ర చేసిన అజ్మల్ అమీర్ (Ajmal Ameer) ఈ మూవీలో కూడా జగన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక వైఎస్ భారతి పాత్రలో మానస రాధా కృషన్(manasa radhakrishnan) నటించబోతుంది. ఈ లుక్స్ చుసిన ఆడియన్స్.. పాత్రలకు వీళ్ళు కరెక్ట్ గా సెట్ అయ్యారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరి వ్యూహం షూటింగ్ మొదలు పెట్టేసిన వర్మ.. ఈ చిత్రాన్ని ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడో చూడాలి. ఇక గత ఎన్నికల ముందు RGV చంద్రబాబు(Chandrababu naidu)ను టార్గెట్ చేస్తూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఇప్పుడు ఈ సినిమాతో మరో సంచలనానికి తెరలేపాడు వర్మ.