వ్యూహం సాంగ్ : వెన్నుపోటు రాజులు.. వెంట నడిచే కుక్కలంటూ టార్గెట్ చంద్రబాబు

వ్యూహం సాంగ్ : వెన్నుపోటు రాజులు.. వెంట నడిచే కుక్కలంటూ టార్గెట్ చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్ర రాజకీయాలపై క్రియేటీవ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తెరకెక్కిస్తున్న మూవీ వ్యూహం(Vyuham). ఈ మూవీ అనౌన్స్మెంట్ తోనే సంచలనాలు క్రియేట్ చేశారు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి వ్యూహం టైటిల్ సాంగ్(Vyuham Title Song) ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ పూర్తిగా 2014 నుండి 2019 వరకు జరిగిన సంఘటనల ఆధారంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ లోని లిరిక్స్ జగన్ పొలిటికల్ క్యాంపెయిన్ కి బూస్ట్ ఇచ్చేలా ఉన్నాయనే చెప్పాలి.

పులుల రూపంలో గుంట నక్కలు..అంటూ స్టార్ట్ అయినా ఈ సాంగ్.. నరకాసుల నవ్వులు..రాబందుల హేళనలు..జగనుడి మౌనం..రాక్షసుల నాట్యం అంటూ ప్రతిపక్షాలపై RGV బాణం నేరుగా సంధించారు. అగ్గి భగ్గు మంది రాజు పదవి కోసం..క్షేమం బుగ్గయ్యింది రాజధానిలో..అంటూ గత ప్రభుత్వ పాలనపై లిరిక్స్ టచ్ చేశారు. 

పులుల వేషంలో గుంట నక్కలు నిక్క బొడిచి ఆడుతున్న రాజకీయ  వ్యూహం.. దొరల వేషంలో సర్పరాజులు..వెన్ను నిమిరి విషం విసిరే పన్నాగం..నక్క తెలివి తేటలతో వరుస హత్యలు..మంచితనం ముసుగేసే సత్య హరిశచంద్రులు..అంటూ ఉన్న లిరిక్స్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు క్రియేట్ చేసేలా ఉన్నాయి.

ఇక నరకాసుల దుర్మార్గం..రాబందుల రాజకీయం. జగనుడి బాణం..రాక్షసుల సంహారం..అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సపోర్ట్గా లిరిక్స్ ఉన్నట్లు తెలుస్తుంది . ఇక దీంతో రామ్ గోపాల్ వర్మ వ్యూహం,ఎవరిపైన బాణం సందించారనే విషయం అర్ధం అవుతుంది.ఈ సాంగ్ ను కీర్తన శేష్ కంపోజ్ చేసి పాడగా..రాజశేఖర్ లిరిక్స్ అందించారు.

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. రెండు పార్టులుగా రానున్న ఈ సినిమా మొదటి పార్ట్ఈ సంవత్సరం, రెండవ పార్ట్ ఏపీ ఎలక్షన్స్ సమయంలో రిలీజ్ చేస్తానని ఆర్జీవీ ఇప్పటికే ప్రకటించారు.

వ్యూహం మూవీలో జగన్ పాత్రను దక్షిణాది నటుడు అజ్మల్ అమీర్ నటిస్తుండగా.. వైఎస్ భారతి పాత్ర లో మానస రాధాకృష్ణన్   నటిస్తుంది.  ‘అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం’ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌ నిర్మిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.