26 Years Of Satya: రామ్ గోపాల్ వర్మ కల్ట్ బొమ్మ.. సత్య సినిమాకు 26 ఏళ్ళు

26 Years Of Satya: రామ్ గోపాల్ వర్మ కల్ట్ బొమ్మ.. సత్య సినిమాకు 26 ఏళ్ళు

సత్య.. ఈ సినిమా గురించి తెలియని సినీ లవర్స్ ఉండరనుకుంటా. 1998లో వచ్చిన ఈ గ్యాంగ్ స్టార్ సినిమా ఎన్నో సంచలనాలను క్రియేట్ చేసింది. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ అండర్ వరల్డ్ గ్యాగ్ స్టార్ సినిమాలో జేడీ చక్రవర్తి, ఊర్మిళ మాటొడ్కర్, మనోజ్ బాజిపేయి కీ రోల్స్ చేశారు. అప్పటివరకు చూడని సరికొత్త కథా, కథనాలతో వచ్చిన ఈ సినిమా విడుదల తరువాత సంచలనం రేపింది. అందుకే.. ఈ సినిమాను చాలామంది కల్ట్ సినిమాగా భావిస్తారు. నేటికీ(జులై 3 1998) సత్య సినిమా విడుదలై 26 ఏళ్ళు పూర్తయింది. దాంతో చాలా మంది ఈ సినిమా కోసం నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో సత్య సినిమా గురించి చాలా మందికి తెలియాలి కొన్ని విషయాలు మీకోసం.     

  • రామ్ గోపాల్ వర్మ యాక్షన్ చిత్రం తీయాలని ఉదేశ్యంతో సత్య సినిమాను మొదలుపెట్టారు. ఆ సమయంలో ముంబైలోని చాలా మంది రౌడీ షీటర్స్, గ్యాంగ్ స్టార్ గురించి అధ్యాయనం చేశాడు. వారి జీవితం కథలు తెలుసుకున్నాడు.
  • అందుకే సత్య సినిమా చూస్తుంటే సినిమాలా కాకుండా నిజంగా చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకోసం రామ్ రోపాల్ వర్మ పడిన కష్టం చాలా ఉంది.
  • ఈ సినిమా రచనా సమయంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, సౌరభ్ శుక్ల సహాయం అందించారు. ఆ తరువాత వారు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్ గా ఎదిగారు. 
  • సత్య సినిమాను కేవలం రూ.2.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. విడుదల తరువాత ఈ సినిమా ఏకంగా రూ.15 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 
  • ఇక ఈ సినిమాలో నటించిన జేడీ చక్రవర్తి, ఊర్మిళ, మనోజ్ బాజిపేయి నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తరువాతే నటుడు మనోజ్ బాజిపేయి బాలీవుడ్ స్టార్ నటుడుగా ఎదిగాడు. 
  • ఈ సినిమాకు విశాల్ భరద్వాజ్, సందీప్ చౌతా సంగీతం అందించగా.. సందీప్ చౌతా నేపధ్య సంగీతాన్ని అందించాడు. 
  • సత్య సినిమా ఆరు ఫిలిం ఫేర్ అవార్డులు, ఒక నేషనల్ అవార్డు దక్కించుకుంది. 
  •  సత్య సినిమాకి గాను ఉత్తమ సహాయ నటుడిగా మనోజ్ బాజిపేయి నేషనల్ అవార్డు అందుకున్నారు.

సత్య సినిమా విషయంలో ఇలాంటి విశేషాలు చాలానే ఉన్నాయి. ఇప్పటివరకు మీరు ఈ సినిమా చూడకపోతే వెంటనే చూసేయండి.