- అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు
సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు వెళ్లకూడదని సినీ నటుడు అల్లు అర్జున్‌కు రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులు పంపించారు. బాలుడిని పరామర్శించేందుకు అనుమతి ఇవ్వాలని రాంగోపాల్పేటపోలీసులకు అల్లు అర్జున్ అంతకుముందు విజ్ఞప్తి చేశారు. కానీ, పోలీసులు అందుకు అనుమతి ఇవ్వలేదు.
ఆదివారం జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి ఆయన మేనేజర్ మూర్తికి నోటీసులు అందజేశారు. దవాఖానలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను చూసేందుకు వెళ్తే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఒకవేళ పరామర్శించేందుకు వెళ్తే, తమ సూచనలు పాటించాలని స్పష్టం చేశారు. లేకపోతే అక్కడ ఎలాంటి ఘటనలు జరిగినా.. దానికి అల్లు అర్జునే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.