బాలరాముడికి ప్రాణప్రతిష్ట: జై శ్రీరామ్ నినాదాలతో స్కూల్ విద్యార్థుల భారీ ర్యాలీ

బాలరాముడికి ప్రాణప్రతిష్ట: జై శ్రీరామ్ నినాదాలతో స్కూల్  విద్యార్థుల భారీ ర్యాలీ

రామజన్మ భూమి అయోధ్యలో  భవ్యరామ మందిరంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది.రామజపంతో పులకించిపోతున్నారు. రామాలయాల్లో సెలబ్రేషన్స్ జరుపుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్  దిల్ సుఖ్ నగర్ లో ఉన్న జీ పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ లో చదువుతున్న వేలాదిమంది విద్యార్థిని విద్యార్థులు..  రాముడు, సీత, లక్ష్మణ, హనుమంతుడి వేషధారణలో భారీ ర్యాలీ నిర్వహించారు.
చిన్నారుల జై శ్రీరాం నినాదాలతో దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. చిన్నారుల దేవతా మూర్తుల వేషధారణలు వీక్షకులను అలరించాయి.

ఈ సందర్భంగా జీ.పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్  ప్రిన్సిపల్ జయ శ్రీ మాట్లాడుతూ.. అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం స్వర్గీయ జి పుల్లారెడ్డి గతంలో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, ఆద్యంతం రామమందిరం నిర్మాణానికి కృషి చేశారని గుర్తు చేశారు. ఎంతో మంది కృషి వల్లనే ఈ రోజు రామ మందిర నిర్మాణం సాధ్యమైందన్నారు.  జీ.పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ ఆధ్యాత్మిక,ధార్మిక కార్యక్రమాలలో ముందుంటుందని తెలిపారు.