ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇవాళ (11 జనవరి 2024) వార్షికోత్సవం కావడంతో మూడు రోజుల వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రతిష్ట ద్వాదశి సందర్భంగా బాల రాముడిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు చేరుకున్నారు.
అయితే వార్షికోత్సవం (Anniversary ) అంటే సరిగ్గా ఏడాది తర్వాత జరిగేది. కానీ రామమందిర వార్షికోత్సవం 11 రోజులు ముందుగానే జరుగుతోంది. అయోధ్య రామమందిర ప్రారంభం 22 జనవరి 2024లో జరిగింది. అంటే 2025లో అదే జనవరి 24న వార్షికోత్సవం నిర్వహించాలి. కానీ ముందాగేనే జనవరి 11న నిర్వహించడం వెనుక పెద్ద కారణం ఉంది.
అయోద్య రామ మందిర వార్షికోత్సవ వేడుకలు జనవరి 11 నిర్వహించాలని పండితులు నిర్ణయించారు. ఎందుకంటే హిందూ పండుగలు, వేడుకలు చంద్రమానం క్యాలెండర్ ప్రకారం నిర్ణయిస్తారు.
రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట పుష్య శుక్లపక్ష ద్వాదశి నాడు జరిగింది. అంటే పుష్య మాసంలో చంద్రుడు 12వ రోజుకు అడుగుపెట్టిన రోజున జరిగింది. 2024లో జనవరి 22న ఈ పుష్య శుక్లపక్ష ద్వాదశి వచ్చింది. హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్య శుక్లపక్ష ద్వాదశి 2025 లో జనవరి 11న వచ్చింది. అందువలన 11 రోజులకు ముందుగానే జనవరి 11న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.