తిరుమల లడ్డూ కల్తీ లొల్లి: అయోధ్య రామ మందిర ప్రధాన పూజారి కొత్త డిమాండ్

తిరుమల లడ్డూ కల్తీ లొల్లి: అయోధ్య రామ మందిర ప్రధాన పూజారి కొత్త డిమాండ్

కలియుగ దైవం తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ ఇష్యూ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందని.. అందులో జంతు నూనె, జంతు కొవ్వులు కలిశాయని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‎తో పాటు యావత్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‎గా మారాయి. తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై దేవాలయాల్లో ప్రసాద తయారీపై ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలో అయోధ్య రామ మందిర ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేవాలయాల్లో ప్రైవేట్ ఏజెన్సీలు తయారు చేసే ప్రసాదాలపై నిషేదం విధించాలని డిమాండ్ చేశారు.

ALSO READ | సీజేఐ కు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి లేఖ: తిరుమల లడ్డూ వివాదాన్ని సుమోటోగా స్వీకరించండి

ప్రస్తుతం ఆలయ నైవేద్యాలలో ఉపయోగించే నెయ్యి స్వచ్ఛతపై ఆందోళన వ్యక్తం చేసిన  సత్యేంద్ర దాస్.. అన్ని దేవాలయాల్లో ప్రసాదాలను ఆలయ పూజారుల పర్యవేక్షణలో తయారు చేయాలని అన్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా విక్రయించే నూనె, నెయ్యి నాణ్యతపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన తనిఖీలు నిర్వహించాలని సూచించారు. దేవాలయాల్లో నైవేద్యాల తయారీకి అనుచిత పదార్థాలను కలిపి ఆలయాలను అపవిత్రం చేసేందుకు అంతర్జాతీయ కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు.