మోదీ కేబినెట్లో యంగెస్ట్ కేంద్రమంత్రిగా రామ్మోహన్ నాయుడు

 మోదీ కొత్త కేబినెట్ కొలువు దీరింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి కేంద్రమంత్రులుగా చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు.  టీడీపీ నుంచి  శ్రీకాకుళం ఎంపీ  కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణస్వీకారం చేశారు. 

అయితే మోదీ కొత్త కేబినెట్ లోని మంత్రుల్లో చిన్న వయసు గల మంత్రి  రామ్మోహన్ నాయుడు కావడం విశేషం.రామ్మోహన్ నాయుడు 36 ఏళ్లకే దేశంలోనే యంగెస్ట్ కేంద్రమంత్రి అయ్యారు. 26 ఏళ్లకే తొలిసారి ఎంపీ అయ్యారు.  వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచారు. వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్‌పై 3,14,107 మెజార్టీతో విజయం సాధించారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో జన్మించిన రామ్మోహన్ నాయుడు బీటెక్, ఎంబీఏ పూర్తిచేశారు.