రాష్ట్రపతి టూర్ వివరాలు లీక్..

కాన్పూర్: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింగ్ పాల్గొంటున్న ఓ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు బహిర్గతం అవ్వడం సంచలనంగా మారింది. రెండ్రోజుల పర్యటన కోసం ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ కు వచ్చిన కోవింద్ టూర్ వివరాలు లీక్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏయే అధికారులు విధుల్లో ఉంటారు, పోలీసు స్టాఫ్, సిబ్బంది పేర్లు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు, వారి ఫోన్ నంబర్లతోపాటు పలు వివరాలు వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం అవుతున్నాయి. ఈ విషయం తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ లీక్ కు ఎవరు బాధ్యులు, వివరాలు ఎలా బహిర్గతం అయ్యాయనే దానిపై అడిషనల్ డిప్యూటీ పోలీసు కమిషనర్ ను దర్యాప్తుకు ఆదేశించారు కాన్పూర్ పోలీసు కమిషనర్ అసిమ్ అరుణ్. కాగా, రాష్ట్రపతి కోవింద్ గురువారం హెచ్బీటీ యూనివర్సిటీ శతవార్షికోత్సవాల్లో పాల్గొననున్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

రన్నింగ్ ట్రైన్ లో స్కూల్ గర్ల్, బోయ్ స్టంట్స్

మోడీ సర్కార్ రిపోర్టు కార్డు.. అన్నింటికీ నాదే బాధ్యత

కరోనా బారిన స్పీకర్ పోచారం