హీరో రామ్ పోతినేని (Ram Pothineni) ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు.పి (Mahesh Babu) దర్శకత్వంలో 'రాపో 22' (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నాడు. మైత్రి మేకర్స్ రూపొందించనున్న ఈ మూవీ నవంబర్ 21న హైదరాబాద్లో పూజా ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఇటీవలే మీకు సుపరిచితుడు.. మీలో ఒకడిని పరిచయం చేస్తామని మైత్రి మేకర్స్ చెప్పింది తెలిసిందే.
తాజాగా మేకర్స్ 'రాపో 22' నుంచి రామ్ క్యారెక్టర్ను పరిచయం చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. 'మీకు సుపరిచితుడు.. మీలో ఒకడు.. మీ సాగర్! అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టర్ లో రామ్ లుక్ ఆకట్టుకుంటోంది. చేతిలో నోట్‌బుక్ పట్టుకుని కాలుతో సైకిల్ స్టాండ్ వేస్తున్న రామ్ లుక్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అయితే, ఈ మూవీలో రామ్ టీచర్గా నటిస్తున్నాడా? లేక స్టూడెంట్ పాత్రలో కనిపించనున్నాడా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి 'సమ్‌థింగ్ ఫ్రెష్, న్యూ, అన్‌టోల్డ్ స్టోరీ ఎక్స్‌పీరియెన్స్' చేయడానికి రామ్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి.
Also Read : సైలెంట్‌గా ఓటీటీకి వచ్చిన తెలుగు ఎమోషనల్ డ్రామా థ్రిల్లర్
రాపో 22 మూవీ విషయానికి వస్తే.. ఇందులో రామ్ సరసన క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) నటిస్తోంది. ఈ చిత్రంతో టాలీవుడ్‌కు కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ పరిచయం అవుతున్నారు. తమిళనాట ఇప్పటికే పలు చిత్రాలకు వర్క్ చేసిన వివేక్,మెర్విన్ సంగీత ద్వయం ఈ చిత్రానికి మ్యూజిక్ అందించబోతున్నారు. వీళ్లిద్దరి అసలు పేర్లు వివేక్ శివ, మెర్విన్ సాల్మన్. ‘వడా కర్రీ’ అనే తమిళ చిత్రంతో కెరీర్ ప్రారంభించి ధనుష్ ‘పటాస్’, ప్రభుదేవా ‘గులేబకావళి’, కార్తి ‘సుల్తాన్’ చిత్రాలతో మ్యూజికల్ హిట్స్ అందుకున్నారు.
When you know him, you will see yourself in him.
— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2024
Meet @ramsayz as 'SAGAR' from #RAPO22 ❤️🔥
He will soon bring an ocean of great cinema moments to the big screens. Shoot begins ✨@bhagyasriiborse @filmymahesh @MythriOfficial @iamviveksiva @mervinjsolomon @sreekar_prasad… pic.twitter.com/MokDBGNggZ