టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని(Ram pothineni) ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Srinu)తో ఒక మాస్ మసాలా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్(Srinivasa silver screen) పతాకంపై శ్రీనివాసా చిట్టూరి(Srinivasa chitturi) నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాను ముందుగా దసరా కానుకగా అక్రోబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేశారు మేకర్స్.
అయితే తాజాగా సినిమా రిలీజ్ డేట్ ను మారుస్తూ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కొత్త అప్డేట్ ప్రకారమా ఈ సినిమా అనుకున్న డేట్ కంటే నెల రోజుల ముందే ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక రామ్ కూడా తన కెరీర్లో అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా చేయడం ఇదే మొదటిసారి. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ఎదురుచూశారు రామ్ ఫ్యాన్స్. తాజాగా సినిమా రిలీజ్ ప్రీ పోన్ అవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
ఇక ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా నటిస్తుండగా.. తమన్(Thaman) సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో రామ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతాడా లేదా అనేది చూడాలి.
ALSOREAD:వైరల్ అవుతున్న కియారా పొట్టి స్కర్ట్.. ధర తెలిస్తే మతిపోతుంది