DoubleISMART Steppa Maar:స్టెప్పా మార్ సాంగ్ రిలీజ్..కిరాక్ లిరిసిస్ట్ రాసిన మాస్ పాటకు ఖతర్నాక్ సింగర్స్

DoubleISMART Steppa Maar:స్టెప్పా మార్ సాంగ్ రిలీజ్..కిరాక్ లిరిసిస్ట్ రాసిన మాస్ పాటకు ఖతర్నాక్ సింగర్స్

ఉస్తాద్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) నుండి వస్తున్న లేటెస్ట్ మూవీ డబల్ ఇస్మార్ట్(Double Ismart). టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్(Puri Jagannadh) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్(Sanjay Dut)  విలన్గా  చేస్తున్నారు.

లేటెస్ట్గా ఈ సినిమా నుంచి  అదిరిపోయే అప్డేట్ వచ్చింది.ఫస్ట్ సింగిల్ స్టెప్పా మార్ సాంగ్ని రిలీజ్ చేశారు మేకర్స్.శివుడి విగ్రహం ముందు రామ్ పోతినేని కంప్లీట్ స్టైలిష్ వైబ్‌లో డ్యాన్స్ చేస్తున్న స్టెప్పా మార్ పాట అదిరిపోయింది. అపున్ కా స్టైల్ క్యా హై మాలూం??..కిరి కిరి కిరి కిరి..మాకీ కిరి కిరే అంటూ సాగే ఈ మాస్ గీతానికి భాస్కరభట్ల సాహిత్యం అందించగా..అనురాగ్ కులకర్ణి,సాహితీ కలిసి హుషారుగా పాడారు.

కిరాక్ లిరిసిస్ట్ రాసిన మాస్ పాటకు ఖతర్నాక్ సింగర్స్ పాడి..ఉస్తాద్ రామ్ స్టెప్పులకి బలాన్ని చేకూర్చారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యూజికల్ హిట్‌గా నిలిచిందో అందరికి తెలిసిందే. ఎంతలా అంటే.. ఇస్మార్ట్ కి ఇచ్చిన సౌండ్ తో..సాంగ్స్ లోని మాస్ బీట్స్‌కు డీజె బాక్సులు బద్దలైపోయాయి కూడా.ప్రస్తుతం రిలీజ్ చేసిన డబుల్ ఇస్మార్ట్ స్టెప్పా మార్ కోసం మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ సౌండ్ దద్దరిల్లేలా కొట్టారు. దీంతో డబుల్ ఇస్మార్ట్ కోసం మణిశర్మ చేసిన మ్యూజిక్ వర్క్ ఎంతలా ఉందో అర్ధం చేసుకోవొచ్చు. కాగా ఈ మూవీ ఆగస్ట్ 15, 2024న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే  మేకర్స్ అనౌన్స్ చేశారు.