ఖాట్మండు: నేపాల్ కొత్త వైస్ ప్రెసిడెంట్ గా రామ్‌సహాయ్ యాదవ్(52) ఎన్నిక య్యారు. జనతా సమాజ్‌బాది పార్టీ అభ్యర్థి అయిన ఆయన.. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో 184 ఫెడరల్, 329 ప్రావిన్షియల్ శాసనసభ్యుల నుంచి 30,328 ఓట్లు సాధించినట్లు ఖాట్మండు పోస్ట్ వార్తాపత్రిక వెల్లడించింది.
ఈ ఎన్నికలో అయనకు సొంత పార్టీతో పాటు నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్ మావోయిస్ట్, సీపీఎన్ యూనిఫైడ్ సోషలిస్ట్ పార్టీలు మద్దతిచ్చాయి. ఫెడరల్ పార్లమెంట్‌లోని 332 మంది ఓటర్లు, ప్రావిన్షియల్ అసెంబ్లీలోని 550 మంది ఓటర్ల ఓట్ల మొత్తం వెయిటేజీ 52,628 కాగా..ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థి కనీసం 26,315 ఓట్లను సాధించాల్సి ఉంటుంది. నేపాల్ 3వ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన రామ్‌సహయ్ యాదవ్..రాబోయే ఐదేళ్లు పదవిలో కొనసాగుతారు.