![రామాలయ శంకుస్థాపన : రామాయణ కాలం నాటి మొక్కలు నాటేందుకు కసరత్తు](https://static.v6velugu.com/uploads/2024/01/ram-temple-consecration-ceremony_D8exwAiXnT.jpg)
జనవరి 22న జరగనున్న రామాలయ ప్రతిష్ఠాపన వేడుకలకు అయోధ్య సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నగరమంతటా డెవలప్‌మెంట్ అథారిటీ రామాయణ కాలం నాటి మొక్కలు, అంతరించిపోయిన చెట్లను నాటేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. మొత్తం 50వేల మొక్కలకు ఆర్డర్ ఇచ్చామని, అవి త్వరలో అయోధ్యకు వస్తాయని భావిస్తున్నారు. మరిన్ని రకాల మొక్కలు ఇక్కడికి వస్తాయని, వాటిని వివిధ వాహనాల సాయంతో ఇక్కడికి పంపిస్తున్నామని నర్సరీ డైరెక్టర్ రామ్ ప్రకాష్ రాథోడ్ చెప్పారు. రామాయణంలో పేర్కొన్న, అంతరించి పోతున్న మొక్కలను అథారిటీ ప్రోత్సహిస్తోందని అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ విశాల్ సింగ్ అన్నారు.
వేలాది మంది ప్రముఖులు, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు హాజరయ్యే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయోధ్యలో రామ్ లల్లా (శిశువు రాముడు) ప్రాణ్-ప్రతిష్ఠ (పవిత్ర) వేడుకకు సంబంధించిన వైదిక ఆచారాలు ప్రధాన వేడుకకు ఒక వారం ముందు అంటే జనవరి 16నుంచే ప్రారంభమవుతాయి. ప్రధాని మోదీ జనవరి 22న రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు దేశ, విదేశాల నుంచి పలువురు వీవీఐపీ అతిథులు ఆలయానికి రానున్నారు.
#WATCH | Uttar Pradesh | Plantation drive is underway in Ayodhya ahead of the 'Pran Pratishtha' ceremony of Ram Temple on January 22. pic.twitter.com/Xp12knobGD
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 6, 2024