అంతా రామమయం..కరీంనగర్ జిల్లాలో ఆలయాల్లో భక్తుల సందడి

నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్, వెలుగు : అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామనామ స్మరణతో మార్మోగింది. ఆలయాలన్నీ జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లాయి.  గ్రామాల్లో అన్నదానాలు, ర్యాలీలు తీసి భక్తిభావం చాటుకున్నారు.  చాలా చోట్ల ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈడీ స్క్రీన్లలో ప్రాణప్రతిష్ఠను వీక్షించారు.  వేములవాడలో రాములోరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న ఆలయం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో లీడర్లు ప్రొజెక్టర్​ ఏర్పాటు చేశారు.

పాత మార్కెట్​మండప హనుమాన్​ఆలయంలో నిర్వహించిన సీతారాముల కల్యాణంలో విప్ ఆది శ్రీనివాస్​ పట్టువస్త్రాలు సమర్పించారు. మల్యాలలో రాములవారి శోభాయాత్ర నిర్వహించారు. రామగుండం ఎన్టీపీసీ టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని హనుమాన్​ దేవాలయంలో నిర్వహించిన పూజల్లో ప్రాజెక్ట్​ ఈడీ కేదార్​రంజన్​ పాండు హాజరయ్యారు.  హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శ్రీరాముని కల్యాణంలో ఎమ్మెల్యే కౌశిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు.  సిరిసిల్ల, చందుర్తి, రాయికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కోరుట్ల, మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, ఎల్లారెడ్డిపేట  మండలాల్లో ఆలయాల్లో పూజలు చేశారు. 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సంబురాలు 

కరీంనగర్​సిటీ, వెలుగు :  అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ  సందర్భంగా కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తెలంగాణ చౌక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  జై శ్రీరామ్​ నినాదాలతో దద్దరిల్లింది. ప్రాణప్రతిష్ఠ ఘట్టం ముగిసేదాకా ఎంపీ బండి సంజయ్​దంపతులు శ్రీరామ విజయ మహా మంత్రాన్ని పఠించారు. సాయంత్రం మహాశక్తి ఆలయంలో సైకతా అయోధ్య రామాలయం వద్ద 5 రామజ్యోతులను వెలిగించారు.

బీజేపీ సీనియర్ నాయకుడు పోల్సాని సుగుణాకర్ రావు ఆధ్వర్యంలో ప్రశాంత్ నగర్ కాలనీలోని ప్రసన్నాంజనేయ దేవస్థానంలో ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. అల్ఫోర్స్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చైర్మన్​నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠను విద్యార్థులు వీక్షించారు.