భైంసా, వెలుగు: తాను పుట్టింది ముథోల్ప్రజల కోసమేనని.. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే అభివృద్ధితో పాటు అందరికీ మేలు చేస్తానని బీజేపీ ముథోల్ అభ్యర్థి రామారావు పటేల్ అన్నారు. శనివారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అధ్యక్షతన భైంసాలో జరిగిన బహిరంగ సభలో రామారావు పటేల్మాట్లాడుతూ బావోద్వేగానికి గురయ్యారు.
ప్రజలకు పాదాభివందనం చేశారు. తాను చనిపోయేంతవరకు బీజేపీతోనే ఉంటానన్నారు. స్థానిక ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పదేండ్ల కాలంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ముథోల్ప్రజలకు మరింత సేవ చేసే ఛాన్స్ఇవ్వాలని కోరారు. గోశాల అభివృద్ధికి పాటుపడుతానని హామీచ్చారు.
బండి సంజయ్రాకతో జోష్
బండి సంజయ్ఆధ్వర్యంలో భైంసాలో జరిగిన ఎన్నికల ప్రచారానికి మంచి స్పందన లభించింది. సభకు యూత్ భారీ సంఖ్యలో తరలివచ్చారు. లోకల్సెంటిమెంట్పై సంజయ్ ఎక్కువగా ఫోకస్‌పెట్టారు. కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ముస్లింలను మోసం చేస్తూ వస్తున్నాయని ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే తాను ముథోల్నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ఈ సందర్భంగా ప్రకటించడంతో పార్టీ వర్గాల్లో నిండింది.