కుంటాల, వెలుగు: పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ అన్ని వర్గాలకు తీరని అన్యాయం చేసిందని ముథోల్ బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కుంటాల మండలంలోని సూర్యపూర్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.
అమరుల త్యాగాలపై ఏర్పడ్డ తెలంగాణలో అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారని ఫైర్అయ్యారు. బీజేపీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆప్క గజ్జరాం, భైంసా ఏఎంసీ చైర్మన్ రాజేశ్ బాబు, రమణారావు, సావ్లీ రమేశ్, పండిత్ రావు, భీం రావు, వెంగళ్ రావు, జక్కుల గజేందర్, పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు.