తొమ్మిదేండ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలే​: రామారావు పటేల్​

భైంసా, వెలుగు: తొమ్మిదేండ్ల పాలనలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం ముథోల్​లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్​ఆరోపించారు. చేతగాని ఎమ్మెల్యే విఠల్​ రెడ్డిని సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భైంసాలోని ఎస్ఎస్​ జిన్నింగ్​ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల్లో ఎమ్మెల్యే, బీఆర్ఎస్​పై తీవ్ర వ్యతిరేకత ఉందని, గ్రామాల్లో ప్రచారానికి వెళ్తే ప్రజలు తిరుగబడుతున్నారని అన్నారు.

మాటలు చెప్పడమే తప్పా.. ఎమ్మెల్యే ఇక్కడ చేసిందేమీ లేదన్నారు. ప్రధాని మోదీ హయాంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రాష్ట్రంలోనూ బీజేపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంగారెడ్డి, జిల్లా ఇన్​చార్జి మల్లారెడ్డి, పార్లమెంట్​ ప్రభారి అల్జాపూర్​శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవిపాండే, గంగాధర్, నారాయణ్​ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్​ తాడేవార్ సాయినాథ్​, భైంసా ఏఎంసీ చైర్మన్ ​రాజేష్​ బాబు తదితరులు పాల్గొన్నారు.