ప్రజలను పట్టించుకోని విఠల్​రెడ్డిని తరిమికొట్టాలి : రామారావు పటేల్

భైంసా, వెలుగు : ప్రజల బాగోగులు పట్టించుకోని ఎమ్మెల్యే విఠల్​రెడ్డిని తరిమికొట్టాలని బీజేపీ ముథోల్​ అభ్యర్థి రామారావు పటేల్​ పిలుపునిచ్చారు. గురువారం భైంసా మండలం కోతుల్​గాం, బిజ్జూర్​ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే తన అనుచరులకు మాత్రమే దళితబంధు, బీసీ బంధు ఇచ్చి మిగతా వారిని మోసం చేశారని ఫైర్​అయ్యారు. 

బీఆర్ఎస్​సర్కారు ఇప్పటి వరకు కొత్త రేషన్​కార్డులు, అర్హులైన వితంతువులకు, దివ్యాగులకు పింఛన్లు మంజూరు చేయలేదన్నారు. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పి మోసం చేశారని విమర్శించారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ కు ఓటుతో గుణపాఠం చెప్పాలని, బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. లీడర్లు తాలోడ్​శ్రీనివాస్, పండిత్​పటేల్, గంగారెడ్డి, భీంరావు పటేల్​తదితరులు పాల్గొన్నారు.