ప్రజలనే నమ్ముకున్న బీజేపీని గెలిపించాలి : రామారావు పటేల్

భైంసా/ముథోల్, వెలుగు : కేసీఆర్ ​పైసలు, పోలీసోళ్లను నమ్ముకుంటే.. బీజేపీ మాత్రం ప్రజలను నమ్ముకుని ముందుకు పోతోందని ఆ పార్టీ ముథోల్​అభ్యర్థి రామారావు పటేల్​అన్నారు. బుధవారం ముథోల్ మండలం చింతకుంటతోపాటు పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్​ఇచ్చే పెన్షన్లు కావాల్నో.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కావాలో మీరే నిర్ణయించుకోవాలన్నారు.

తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కమలం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. లీడర్లు నర్సాగౌడ్, మోహన్​రెడ్డి, విజయ్​ దితరులు పాల్గొన్నారు. 

కేంద్ర పథకాలను వివరించాలి

ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశ పెట్టిన ప్రతీ స్కీమ్​ను బీజేపీ శ్రేణులు గడపగడపకు వెళ్లి ప్రజలకు వివరించాలని గడ్చిరోలి ఎంపీ అశోక్​ మాధవ్ ​రావు సూచించారు. బుధవారం భైంసాలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత విశ్వకర్మ యోజన కింద మట్టి పాత్రలు తయారు చేస్తున్న కోటగిరి నరేశ్ ఇంటికి వెళ్లి వోకల్​ఫర్​ లోకల్​ప్రాముఖ్యతను వివరించారు.

స్థానిక బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్​ను భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీ పంపాలని కోరారు. ఇందులో పార్లమెంటరీ కన్వీనర్ ​అయ్యన్నగారి భూమయ్య, తాలూక కన్వీనర్​ తాడేవార్​  లీడర్లు రవిపాండే, గంగాధర్, రాజేశ్వర్​రెడ్డి, మెడిసెమ్మ రాజు పాల్గొన్నారు.