
భైంసా/కుభీర్, వెలుగు: ముథోల్ నియోజకవర్గాన్ని తొమ్మిదేండ్లలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అభివృద్ధి చేయలేదని.. తనకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామారావు పటేల్అన్నారు. ఆదివారం భైంసాలోని కిసాన్గల్లీలో జెండా ఆవిష్కరించారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ మినహా ప్రజల సమస్యలను ఎమ్మెల్యే పట్టించుకొలేదన్నారు. రామారావు పటేల్ కొడుకు సందీప్ పవార్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరికలు జరిగాయి.
చుచుంద్ సర్పంచ్‌తో పాటు భైంసా మార్కెట్‌కమిటీ డైరక్టర్ సురేశ్ పటేల్, గ్రామ అధ్యక్షుడు బాపూరావు, మరో 150 మంది బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్, కౌన్సిలర్ గాలి రవికుమార్, తాలోడ్ శ్రీనివాస్, సోలంకి భీంరావు, పండిత్పటేల్తదితరులు పాల్గొన్నారు.