
భైంసా, వెలుగు: పాత, కొత్త లీడర్లు, కార్యకర్తలందరినీ కలుపుకొని వెళ్దామని బీజేపీ ముథోల్ ఎమ్మెల్యే అభ్యర్థి రామారావు పటేల్పేర్కొన్నారు. భైంసాలోని పార్టీ ఆఫీస్‌లో ఆదివారం కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. జిల్లా అధ్యక్షురాలు రమాదేవీ పార్టీని వీడినంత మాత్రాన బీజేపీ బలహీనపడలేదని, పార్టీకి ఎలాంటి నష్టం జరగదన్నారు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందన్నారు. ముథోల్‌లో ఈసారి కాషాయ జెండా ఎగురవేసి ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి గిఫ్ట్ఇద్దామన్నారు. ఈ నెల 31న ఎస్ఎస్ ఫ్యాక్టరీలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని, ప్రతి కార్యకర్త హాజరు కావాలని కోరారు.
అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి
దుర్గామాత నిమజ్జనోత్సవంలో భాగంగా హిందూవాహిని కార్యకర్తలపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని రామారావు పటేల్డిమాండ్చేశారు. ఆదివారం భైంసా టౌన్పీఎస్లో సీఐ శ్రీనివాస్‌ను కలిసి మాట్లాడారు. శోభాయాత్రలో హిందూవాహిని కార్యకర్తలపై అకారణంగా పోలీసులు లాఠీచార్జ్ చేశారని, పోలీసులపైనే కేసులు నమోదు చేయాలన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణ రెడ్డి, న్యాయవాది రవిపాండే, పట్టణ అధ్యక్షుడు మల్లేశ్, కౌన్సిలర్లు కపిల్సింధే, పోశెట్టి, గౌతం పింగ్లే, గోపాల్సార్డా తదితరులున్నారు.