తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే : రామారావు పటేల్

కుంటాల, వెలుగు:   రాష్ట్రంలో వచ్చేది బీజేపీ  సర్కారేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామారావు పటేల్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు.  తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న అంగన్ వాడీ, ఆశ వర్కర్లకు శుక్రవారం కుంటాలలో ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కనీస వేతనాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. 

బీఆర్ ఎస్ కు రానున్న రోజుల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో ఎంపీపీ ఆప్క గజ్జరాం, సర్పంచ్  చంద్రకాంత్,   పిప్పేర వెంగళ్ రావు, నవీన్, లక్ష్మణ్ పటేల్, యాదవ్ రావు, ప్యాదరి భూమన్న,ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు...