
లక్ష్యం, లౌక్యం లాంటి సక్సెస్‌ఫుల్ మూవీస్ తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘రామబాణం’. డింపుల్ హయతి హీరోయిన్. జగపతి బాబు, ఖుష్బూ కీలకపాత్రలు పోషిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా గోపీచంద్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ‘విక్కీస్ ఫస్ట్ యారో’ పేరుతో విడుదల చేసిన వీడియోలో యాక్షన్ సీన్స్‌లో కనిపించాడు గోపీచంద్.
అయితే యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్‌టైన్మెంట్, సోషల్ మెసేజ్ ఉన్న సినిమా ఇదంటున్నారు మేకర్స్. గోపీచంద్ కెరీర్‌లో ఇది 30వ చిత్రం. భూపతి రాజా కథను అందించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. సచిన్ ఖేడ్ ఖర్, నాజర్, ఆలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా నటిస్తున్నారు. సమ్మర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.