
మణుగూరు, వెలుగు : సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో గడచిన జూన్ నెలలో 118 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జిఎం దుర్గం రామచందర్ తెలిపారు. జీఎం కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ వివరాలు వెల్లడించారు. ప్రొడక్షన్, ప్రోడక్టివిటీ, ట్రాన్స్పోర్ట్ లో అన్ని ఏరియాలకు దీటుగా మణుగూరు ఏరియాను నిలుపుతున్న కార్మికులను, అధికారులను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో ఏజీఎం జి.నాగేశ్వరరావు, ఏరియా ఇంజనీర్ నర్సిరెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్స్ శ్రీనివాస చారి, లక్ష్మీపతి గౌడ్, డీజీఎంలు ఎస్.రమేశ్, కే.వెంకట్రావు, పాల్గొన్నారు.