జైలు నుంచి రామచంద్ర భారతి రిలీజ్

జైలు నుంచి రామచంద్ర భారతి రిలీజ్

హైదరాబాద్​ : చంచల్ గూడా జైలు నుంచి రామచంద్ర భారతి రిలీజ్ అయ్యాడు. నకిలీ పాస్ పోర్ట్ కేసులో రామచంద్ర భారతికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు బెయిల్ పై విడుదలైయ్యాడు. షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. రామచంద్ర భారతి ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో A1 నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. 

నకిలీ పాస్‌పోర్ట్ కేసులో రామచంద్రభారతి ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దాన్ని పరిశీలించగా కీలక విషయాలు బయటపడ్డాయి. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలు సమర్పించి  పాస్‌పోర్ట్‌ పొందినట్లు సిట్ విచారణలో తేలింది. దీంతో రామచంద్రభారతిపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు ఈ నెల 22న అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించారు.