మరిపెడ, వెలుగు : ప్రజాభీష్టం మేరకు పనిచేస్తానని డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ చెప్పారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజవకర్గంలో సోమవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా దంతాలపల్లి, నర్సింహులపేట మండలాల మీదుగా మరిపెడకు చేరుకున్నారు.
పీహెచ్‌సీలో ఆరోగ్యశ్రీ పథకాన్ని, మరిపెడ బస్టాండ్‌లో ఫ్రీ బస్ జర్నీని ప్రారంభించారు. అనంతరం లక్ష్మారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించిన మీటింగ్‌లో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజలకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. తాను కడుపు మాడ్చుకొని అయినా కార్యకర్తల కడుపు నింపుతానని భరోసా ఇచ్చారు. మరిపెడ మున్సిపాలిటీలో రూ. 50 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు నెహ్రూనాయక్, రఘువీరారెడ్డి, యుగంధర్‌రెడ్డి, అఫ్జల్, తాజుద్దీన్, ఐలమల్లు, రవి, శ్రీను పాల్గొన్నారు.