జీతాలు చెల్లించాలని ఈఎస్‌‌ఐ కార్మికుల నిరసన

 జీతాలు చెల్లించాలని ఈఎస్‌‌ఐ కార్మికుల నిరసన

సంగారెడ్డి టౌన్ ,వెలుగు: తమకు నాలుగు నెలల పెండింగ్‌‌ జీతాలు చెల్లించాలని డిమాండ్‌‌ చేస్తూ సంగారెడ్డి కలెక్టరేట్‌‌ ఎదుట సోమవారం రామచంద్రాపురం ఈఎస్‌‌ఐ హాస్పిటల్‌‌ కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ ఈఎస్‌‌ఐ హాస్పిటల్‌‌లో 12 ఏళ్లుగా పనిచేస్తున్నా కార్మికులకు నేటికీ చట్టపరమైన సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. నాలుగు నెలలుగా జీతాలు రాక కార్మికుల కుటుంబాలు అవస్థలు పడుతున్నాయన్నారు. ఆందోళనలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, నరసింహారెడ్డి, కార్మికులు యాదయ్య, సిద్దు, సాయిరాం, రమేశ్, లక్ష్మి, తదితరులు ఉన్నారు.