మరిపెడ(చిన్న గూడూరు)వెలుగు: మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల పరిషత్లో సోమవారం జనరల్ బాడీ మీటింగ్ సోమవారం నిర్వహించారు. ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు. మండల కేంద్రంలో నిర్మించిన 100 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లో అవినీతి జరిగిందని, కొందరు దళారులు లక్షన్నర నుంచి రెండున్నర లక్షల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని తెలిపారు.
వాళ్లు వెంటనే బాధితులకు డబ్బులు తిరిగి ఇచ్చేయాలని, లేకుంటే బాధితుల ఫిర్యాదుతో చీటింగ్ కేసు పెట్టాలని ఆఫీసర్లను ఆదేశించారు. గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్ల పాలన మొదలైనందున ఆఫీసర్లు గ్రామాలను పర్యవేక్షించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలోఎంపీపీ పద్మ, వైస్ ఎంపీపీ వీరన్న, కో ఆప్షన్ సభ్యులు మోషిన్ బేగ్, ఎంపీటీసీ ఉదయమ్మ, తహసీల్దార్ మహబూబ్ అలీ, ఎంపీడీవో శ్యాంసుందర్, స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
Also Read : కేసీఆర్, జగన్ కుమ్మక్కయ్యారు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి