సర్పంచ్ ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత మస్త్యాల గ్రామ సర్పంచ్ అయిన రామగిరి లావణ్యకు మరో అరుదైన గౌరవం దక్కింది. సైబా అవార్డు 2023.. మిస్ స్టార్ ఇండియా కాంపిటిషన్ 2023, బ్యూటీ అవార్డ్స్, ఫ్యాషన్ అవార్డ్స్ లో స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్నారు ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత, మస్త్యాల గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య.
డిసెంబర్27న సోమాజీగూడ లోని ది పార్క్ హోట్లలో జరిగిన సౌత్ ఇండియా ఇంఫ్ల్యూయెన్సర్ అవార్డ్ ప్రోగ్రాంలో స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామగిరి లావణ్య మాట్లాడుతూ సౌత్ ఇండియా ఇంఫ్ల్యూయెన్సర్ అవార్డ్ ప్రోగ్రాంలో స్పెషల్ గెస్ట్ గా నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల సర్పంచ్ రామగిరి లావణ్య 2023 జూలై 2న ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఉమెన్ పార్లమెంటు అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 46 దేశాల మహిళలు పాల్గొనగా ఇండియాలోని 10 మంది మహిళలు ఈ అవార్డు తీసుకున్నారు.
ప్రపంచ దేశాల్లో ముస్త్యాల పేరును నిలబెట్టారు రామగిరి లావణ్య. గ్రామంలో చేసిన సేవలతో పాటు భారతదేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడిన సమరయోధుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించినందుకు ఈ అవార్డు బహుకరించారు.