
గోదావరిఖని, వెలుగు: గ్రీన్ బడ్జెట్ నిధులను సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్, రామగుండం కమిషనర్ జె.అరుణశ్రీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రామగుండలం ఇందిరమ్మ కాలనీ, దుర్గా నగర్, గౌతమి నగర్‌లలో పార్కులు, పట్టణ ప్రకృతి వనాలు, మియావాకి ఉద్యానవనాన్ని పరిశీలించారు. పార్కులు, పట్టణ ప్రకృతి వనాలలో పచ్చదనం పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సిటీలో నల్లాల ద్వారా రక్షిత మంచి నీరు ప్రతిరోజూ సరఫరా చేసే ప్రయత్నాల్లో భాగంగా భీమునిపట్నం, ఎన్టీపీసీ ప్రాంతంలో జరుగుతున్న ట్రయల్ రన్ పరిశీలించారు. ఆమె వెంట ఈఈ రామన్, డీఈ షాబాజ్, ఏఈ తేజస్విని ఉన్నారు.