రామగుండం కాంగ్రెస్ టికెట్తమలో ఎవరికిచ్చినా ఓకే అంటున్నారు ముగ్గురు సీనియర్లు. టికెట్కోసం అప్లికేషన్ పెట్టుకున్న పీసీసీ ఉపాధ్యక్షుడు హర్కర వేణుగోపాలరావు, ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, హెచ్‌ఎంఎస్ ప్రెసిడెంట్ రియాజ్ అహ్మద్ ఇటీవల ఎన్టీపీసీ ఏరియాలో మీటింగ్ పెట్టుకున్నారు. తమ ముగ్గురిలో ఎవరికి టికెట్ దక్కినా మిగతా వాళ్లు నారాజ్ కాకుండా కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఇక్కడ కాంగ్రెస్టికెట్మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కు ఇచ్చే అవకాశముంది. ఆయన టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా హైకమాండ్ కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన సీనియర్లు.. ఐక్యతారాగం అందుకున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వీరి ఐక్యతను హైకమాండ్ ఎంత వరకు గుర్తిస్తుందో.