-
బీఆర్‌ఎస్‌కు రామగుండం కార్పొరేటర్ రాజీనామా
గోదావరిఖని, వెలుగు : బీఆర్‌ఎస్‌కు చెందిన రామగుండం కార్పొరేషన్ 15వ డివిజన్ కార్పొరేటర్ శంకర్ నాయక్ ఆ పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. ఈ మేరకు యైటింక్లైన్ కాలనీలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ లో బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, అవమానిస్తున్నారని ఆరోపించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, సింగరేణిలో టీబీజీకేఎస్ సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఆయనతోపాటు టీబీజీకేఎస్ బ్రాంచ్ సెక్రెటరీ పైడిపల్లి ప్రభాకర్ కూడా యూనియన్‌కు రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు చెప్పారు. కాగా బీఆర్‌ఎస్ పార్టీ, యూనియన్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందున కార్పొరేటర్ శంకర్ నాయక్, పైడిపల్లి ప్రభాకర్‌ను యూనియన్ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి ప్రకటించారు.