- కార్పొరేటర్ల ఏకగ్రీవ తీర్మానం
గోదావరిఖని, వెలుగు : రామగుండం కార్పొరేషన్ మేయర్ అనిల్‌కుమార్‌పై బీఆర్ఎస్పార్టీకే చెందిన కార్పొరేటర్లు అవిశ్వాసం పెట్టాలని చూడగా, బుధవారం ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అధ్యక్షతన గోదావరిఖనిలో బుధవారం నిర్వహించిన మీటింగ్‌లో 34 మంది కార్పొరేటర్లు మేయర్‌పై అవిశ్వాసం ఉండబోదని ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఈ విషయాన్ని కోరుకంటి చందర్ ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ అధిష్ఠానం నిర్ణయానికి కార్పొరేటర్లు కట్టుబడి ఉన్నారని తెలిపారు. రామగుండం మేయర్, డిప్యూటీ మేయర్‌పై కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం పెడుతున్నారని ప్రచారం జరిగిందని, కానీ, కార్పొరేటర్లతో మాట్లాడి నిర్ణయాన్ని విరమించుకునేలా చేశామన్నారు. విషయాన్ని కేసీఆర్, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ దృష్టికి తీసుళ్లనున్నట్టు చెప్పారు.