గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని గౌతమినగర్‌లో అనుమతి లేకుండా నిర్మిస్తున్న బిల్డింగ్‌ను రామగుండం కార్పొరేషన్ ఆఫీసర్లు బుధవారం కూల్చివేశారు. గౌతమినగర్‌లోని ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీకి చెందిన పర్లపెల్లి సందీప్ అక్రమంగా బిల్డింగ్ నిర్మిస్తుండడంతో నోటీస్‌జారీ చేసినట్లు టౌన్‌ప్లానింగ్ అధికారులు తెలిపారు.
అయినప్పటికీ స్పందించకపోవడంతో ఇన్‌చార్జి కమిషనర్ అరుణ శ్రీ ఆదేశాల మేరకు కూల్చివేసినట్లు టౌన్‌ప్లానింగ్, అసిస్టెంట్‌సిటీ ప్లానర్శ్రీధర్ ప్రసాద్, సూపర్‌వైజర్ నవీన్ తెలిపారు.