మావోయిస్టుల సమాచారమిస్తే బహుమతి : సీపీ శ్రీనివాస్​

మావోయిస్టుల సమాచారమిస్తే బహుమతి : సీపీ శ్రీనివాస్​

గోదావరిఖని, వెలుగు: మావోయిస్టులకు సహకరించవద్దని రామగుండం సీపీ ప్రజలను కోరారు. ఈ మేరకు సోమవారం కమిషనరేట్​ ఆఫీస్​లో మంచిర్యాల డీసీపీ అశోక్​ కుమార్, స్పెషల్​ బ్రాంచ్​ ఏసీపీ రాఘవేంద్రరావుతో కలిసి పోస్టర్లు  విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టుల కదలిక లపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నామని, వారి సమాచారం తెలిపిన వారికి నగదు బహుమతి కూడా అందజేస్తామన్నారు. సమాచారం తెలిస్తే రామగుండం సీపీ ఆఫీస్‌‌ నంబర్‌‌‌‌ 08728 271333, పెద్దపల్లి డీసీపీ 87126 56502, మంచిర్యాల డీసీపీ 87126 56503, ఎన్​ఐబీ 87126 56596 ఫోన్‌‌ చేయాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీపీ స్పష్టం చేశారు.