- రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్
బెల్లంపల్లి, వెలుగు : గతంలో కంటే ఓటర్లలో చైతన్యం పెరిగిపోయిందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే అభిప్రాయంలో ఉన్నారని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియా స్కూల్ లోని పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఓటింగ్ సరళని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు చెప్పారు.
పోలీస్ అధికారులు, సిబ్బంది, ఎన్నికల అధికారులు, జిల్లా యంత్రాంగం సమిష్టి కృషితోనే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ ఎండలను లెక్కచేయకుండా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం అభినందనీయమన్నారు. కమిషనరేట్ పరిధిలోని పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణకు అంకితమై పనిచేయడంతోపాటు రెవెన్యూ యంత్రాంగం
ప్రభుత్వ ఎన్నికల సిబ్బంది కృషి కారణంగా ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. సీపీ వెంట బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, ఎస్బీ డీఎస్పీ రాఘవేందర్ రావు, బెల్లంపల్లి వన్ టౌన్, రూరల్, ఇన్స్పెక్టర్లు ఎన్.దేవయ్య, అఫ్జలుద్దీన్, ఎస్ఐలు ఉన్నారు.