ఫేక్‌‌‌‌‌‌‌‌ న్యూస్‌‌‌‌‌‌‌‌కు చెక్‌‌‌‌‌‌‌‌ పెట్టండి : రెమా రాజేశ్వరి

​​​​​గోదావరిఖని/ కోల్‌‌‌‌‌‌‌‌బెల్ట్‌‌‌‌‌‌‌‌, వెలుగు : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆకతాయిలు సృష్టించే ఫేక్‌‌‌‌‌‌‌‌ న్యూస్‌‌‌‌‌‌‌‌కు జర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌లు చెక్‌‌‌‌‌‌‌‌ పెట్టాలని, ఏదైనా విషయం అనుమానాస్పదంగా ఉంటే పోలీసులను, ఎన్నికల రిటర్నింగ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లను సంప్రదించాలని రామగుండం సీపీ రెమా రాజేశ్వరి జర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌లను కోరారు. బుధవారం రామగుండం పోలీస్‌‌‌‌‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన వివిధ పత్రికలు, న్యూస్‌‌‌‌‌‌‌‌ ఛానెళ్ళ జర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌లకు మీడియా వర్క్‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసులు, జర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌లు క్లారిఫికేషన్‌‌‌‌‌‌‌‌, కమ్యూనికేషన్‌‌‌‌‌‌‌‌, కో ఆర్డినేషన్‌‌‌‌‌‌‌‌తో పనిచేయాలన్నారు.

కాంపిటీషన్‌‌‌‌‌‌‌‌, సెన్షెషన్‌‌‌‌‌‌‌‌ కోసం హింసను ప్రేరేపించే వార్తలు రాయవద్దన్నారు. సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో వచ్చే ఫేక్‌‌‌‌‌‌‌‌ న్యూస్‌‌‌‌‌‌‌‌ను నిర్ధారించుకునేందుకు 8799711259 నెంబర్‌‌‌‌‌‌‌‌లో సంప్రదించాలని సీపీ కోరారు. కాగా కమిషనరేట్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ల వద్ద అభ్యర్థులు నామినేషన్లు వేసే సందర్భంలో 144 సెక్షన్‌‌‌‌‌‌‌‌ అమలులో ఉంటుందని, జనం గుంపులు గుంపులుగా ఉండకూడదన్నారు. ఈ వర్క్‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌లో పెద్దపల్లి, మంచిర్యాల డీసీపీలు డాక్టర్‌‌‌‌‌‌‌‌ చేతన, సుధీర్‌‌‌‌‌‌‌‌ కేకన్‌‌‌‌‌‌‌‌, కమిషనరేట్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని ఏసీపీలు తుల శ్రీనివాసరావు, ఎడ్ల మహేశ్‌‌‌‌‌‌‌‌, తిరుపతిరెడ్డి, సదయ్య, మోహన్‌‌‌‌‌‌‌‌, తదితరులు పాల్గొన్నారు.