ఇటుక బట్టీ కార్మికుల పిల్లలకు వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూళ్లు : సీపీ శ్రీనివాస్​

ఇటుక బట్టీ కార్మికుల పిల్లలకు వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూళ్లు :  సీపీ శ్రీనివాస్​
  • రామగుండం సీపీ శ్రీనివాస్​

పెద్దపల్లి, వెలుగు: ఇటుక బట్టి కార్మికుల పిల్లలకు కార్పొరేట్​ స్టాయిలో విద్యను అందించేందుకు వర్క్​ సైట్​ స్కూళ్లు ప్రారంభిస్తున్నట్లు రామగుండం సీపీ శ్రీనివాస్​తెలిపారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్​ జీపీ పరిధిలోని ఇటుక బట్టీల్లో శుక్రవారం వర్క్​సైట్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలస కార్మికుల పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఈ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించినట్లు చెప్పారు. 

వర్క్​సైట్​స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 70 మంది పిల్లలు ఉన్నారని, వారికి ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి 5వ తరగతి వరకు ఒడియా మీడియంలో విద్యాబోధన చేపడుతున్నామన్నారు. రామగుండం కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని అన్ని ఇటుక బట్టీల దగ్గర ఈ స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో డీసీపీ చేతన, ఏసీపీలు జి.కృష్ణ, ఎం.రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనిల్, బసంత్ నగర్ ఎస్సై స్వామి పాల్గొన్నారు.